Dec 5, 2019, 1:04 PM IST
సుప్రీంహీరో సాయిధరమ్ తేజ, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రతిరోజు పండగే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సత్యరాజ్, రావు రమేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుందని అదే సమయంలో ఆలోచించేలా చేస్తుందని అంటున్నారు ఈ టీం. ఈ సినిమా గురించి ఒకముక్కలో చెప్పేది కాదు అన్నాడు థమన్. నాతో నిజంగా నా చేత ఓ మంచి సినిమా తీయించారంటున్నాడు దర్శకుడు మారుతి.