ఆ స్టార్‌ సింగర్‌ అంటే సురేఖవాణి కూతురుకి అంత పిచ్చా?.. సింగిలైతే తానురెడీ అంటూ సుప్రీత బోల్డ్ స్టేట్‌మెంట్‌

Published : Apr 26, 2024, 10:47 PM ISTUpdated : Apr 27, 2024, 07:32 AM IST

సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. బోల్డ్ గా హల్‌చల్ చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు స్టార్‌ సింగర్‌లపై తన క్రష్‌ని బయటపెట్టింది.   

PREV
17
ఆ స్టార్‌ సింగర్‌ అంటే సురేఖవాణి కూతురుకి అంత పిచ్చా?..  సింగిలైతే  తానురెడీ అంటూ సుప్రీత బోల్డ్ స్టేట్‌మెంట్‌

సీనియర్‌ నటి సురేఖవాణి ఒకప్పుడు కామెడీ ఆర్టిస్ట్ గా మెప్పించింది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బిజీగా రాణించారు. కానీ ఆ మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం దుమ్ములేపుతుంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఫోటో షూట్లు, ఎంజాయ్‌మెంట్లు, ఫారెన్‌ టూర్లతో హంగామా చేస్తుంది. తన పర్సనల్‌ విషయాలు పంచుకుంటూ రచ్చ చేస్తుంది. 
 

27

ఇక కూతురు సుప్రీత కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బోల్డ్ గా రచ్చ చేస్తుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి గాలెం వేస్తూ అలరిస్తుంది. పొట్టిదుస్తుల్లో కనిపిస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వదు. ఇక తల్లీకూతుళ్లు చేసే యాక్టివిటీస్‌ చాలా వరకు ట్రోల్స్ కి కారణమవుతుంటుంది. 

37

ఇదిలా ఉంటే సుప్రీత హీరోయిన్‌గా మారింది. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అమర్‌ దీప్‌ హీరోగా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఈ మూవీ ఉంది. ప్రస్తుతం సుప్రీత ఈ మూవీలో బిజీగా ఉంది.

 

47

ఇదిలా ఉంటే సుప్రీత.. లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె స్టార్‌ సింగర్‌పై తన క్రష్‌ని బయటపెట్టింది. ఆయనంటే ఇష్టమని, సింగిల్‌ అయితే తనకు ఓకే అనే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని యాంకర్‌ రీతూ చౌదరి వెల్లడించడం విశేషం. తాజాగా ఇది రచ్చ రచ్చ అవుతుంది. 

57

రీతూ చౌదరి యాంకర్ గా `దావత్‌` అనే టాక్ షో రన్‌ అవుతుంది. సెలబ్రిటీలు ఇందులో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో సింగర్‌ శ్రీరామ చంద్ర పాల్గొన్నారు. ఓ వైపు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతలో యాంకర్‌ రీతూ చౌదరి.. ఆయనపై ఇద్దరు భామలు క్రష్‌ పెంచుకున్నారని తెలిపింది. 
 

67

మీపై ఇద్దరు అమ్మాయిలు క్రష్‌ పెంచుకున్నారని, ఇష్టపడుతున్నారని రీతూచౌదరి తెలిపింది. ఎవరు అని అడగ్గా, కుషిత అని చెప్పింది. ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే.. శ్రీరామ చంద్ర లాంటి అబ్బాయి కావాలని, ఆయన మొగుడిలా అనిపిస్తాడు. మొగుడైతే బాగుండూ అని చెప్పినట్టు రీతూ చౌదరి తెలిపింది. దీంతో షోలో ఆడియెన్స్ కేకలు వేయగా, శ్రీరామ చంద్ర మీసాలు తిప్పుతూ రెచ్చిపోయాడు. 
 

77

ఇక మరో అమ్మాయి గురించి చెబుతూ, ఆమె సుప్రీత అని వెల్లడించింది. ఎవరు నీ క్రష్‌ అంటే.. శ్రీరామ చంద్ర నా క్రష్‌ అని చెప్పిందట. అంతేకాదు దావత్‌ షోకి వస్తున్నాడని ఆమెతో చెబితే.. ఏ అడుగు నేను సింగిలే, ఆయన సింగిలా కాదా అని అడగమని చెప్పిందట సుప్రీత. దీనికి నవ్వులు పూయించిన శ్రీరామ చంద్ర, తాను సింగిలే అని, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ క్లిప్‌ యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories