Mumaith Khan‘s WELYKE Hair Beauty Academy Launch: యాక్టర్, డాన్సర్ ముమైత్ ఖాన్ కొత్త కెరీర్ ప్రారంభించారు. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ముమైత్... బ్యూటీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో WELYKE Hyderabad’s Most Glamorous Hair & Beauty Academyని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్‌తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, యాక్టర్స్ జ్యోతి, అక్సా ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.