విజయ్ దేవరకొండకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు : బెనర్జీ

May 6, 2020, 5:57 PM IST

మంచి కార్యక్రమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ మీద పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ అన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ  ఒక ఛారిటీని పెట్టి ఫండ్స్ ని పోగు చేసి తనవంతు సాయంగా పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఆయనపై పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారిని నేను నిలదీస్తున్నా  అసలు మీరు ఎవరు..మా ఆర్టిస్టులు మా ఇష్టం. ఎవరికి సాయం చేస్తాం..ఎవరికి ఎంత డొనేట్ చేస్తాం అనేది మా ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలపై ఎవరికి సమాధానం చెప్పాలి..ఎవరికి చెప్పకూడదనేది మా ఇష్టం అని  బెనర్జీ తెలిపారు.