Aug 22, 2020, 10:54 AM IST
నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ రాజా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రొడక్షన్ నెం. వన్ చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. హీరో విజయ్ రాజా, హీరోయిన్ తమన్నా వ్యాస్, దర్శకుడు రామ్స్ రాథోడ్, నిర్మాత తూము నరసింహ పటేల్, రచ్చ రవిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రెండో షెడ్యూల్ కి వెళ్లబోతున్న ఈ సినిమా జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్ మీద నిర్మితమవుతోంది.