Jul 20, 2020, 1:57 PM IST
కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ నటించిన హర్రర్-కామెడీ సినిమా ఫోన్ భూత్. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేశారు. 2021లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పోస్టర్ లాక్ డౌన్ కంటే ముందు షూట్ చేసిందిగా వారు చెబుతున్నారు. గల్లీ బాయ్, తూఫాన్ ల తరువాత ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కింద వస్తున్న సినిమా ఇది. ఈ సూపర్ నాచురల్ కామెడీ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా, రితేజ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ లు నిర్మిస్తున్నారు.