Bheemla Nayak:రూ.100కాదు రూ.1000 పెట్టయినా పవన్ సినిమా చూస్తాం..: పవన్ ఫ్యాన్స్

Feb 25, 2022, 3:13 PM IST

మైలవరం: భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వ వైఖరిపై పవన్ కళ్యాణ్ అభిమానుల ఫైర్ అవుతున్నారు. సినిమాను సినిమాగానే చూడాలి కానీ దీంతో రాజకీయం చేయొద్దని సూచించారు. కోర్టులో ఎప్పుడో రద్దయిన జీవో నెంబర్ 35 ను ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయటం సరికాదని పవన్ అభిమానులు అన్నారు. 

పవన్ కల్యాణ్ సినిమా వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు పెట్టయినా సరే చూస్తామన్నారు. మద్యం కోసం వేలకు వేలు తగలేస్తున్నాం... అలాంటిది అభిమాన హీరో కోసం రూ.1000 పెట్టి టికెట్ కొనడానికి వెనుకాడమన్నారు. మద్యం తాగడానికి తాము వారానికి మూడు వేలు ఖర్చు చేస్తున్నాం...  వీలైతే వాటి ధరను తగ్గించండని ఓ అభిమాని ప్రభుత్వాన్ని కోరాడు. ప్రజలకు మంచి చేయాలి అనుకుంటేమద్యం రేట్లు తగ్గించాలన్నారు. సినిమా ఇక్కడ కాకపోతే తెలంగాణ వెళ్లి చూస్తామని పవన్ అభిమానులు అంటున్నారు.