అల వైకుంఠపురములో పబ్లిక్ టాక్: సంక్రాంతి పందెం పుంజు ఇదే..

Jan 12, 2020, 2:39 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. టైటిల్ వినగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నాడని అనిపించింది. ట్రైలర్, టీజర్ చూడగానే త్రివిక్రమ్ టేకింగ్ కు అల్లు అర్జున్ స్టైల్ తోడైందని.. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని అభిమానులు చెబుతున్నారు.