నా కేరీర్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు నవ్విన సినిమా `1st ర్యాంక్ రాజు`: నరేష్ (వీడియో)

Mar 16, 2019, 12:58 PM IST

2015 కన్నడ బ్లాక్ బస్టర్ `1st ర్యాంక్ రాజు` (`విద్య 100% బుద్ధి 0%`) తెలుగులో అదే పేరుతో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి.కందుకూర్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ - లోగో - టీజర్ ను `మా` అధ్యక్షుడు నరేష్ - డైరెక్టర్ మారుతి సంయుక్తంగా విడుదల చేశారు.

 హైదరాబాద్ లో జరిగిన టీజర్ వేడుకలో `మా` అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ - ``ఒక అద్భుతమైన పాయింట్ ని వినోదాత్మకంగా చెబుతున్నారు. కన్నడలో చాలా పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే టీం తెలుగులో చేయడమే తొలి సక్సెస్. త్రివిక్రమ్ - సుకుమార్ - కొరటాల వంటి దర్శకులు నాకు మంచి పాత్రలను క్రియేట్ చేస్తున్న తరుణంలో మారుతి - నరేష్ కుమార్ వంటి యువదర్శకులూ మంచి పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో తండ్రి పాత్రలో చేస్తున్నా. `అఆ` సినిమాతో కూతుళ్లంతా ఇలాంటి తండ్రి ఉంటే బావుండేదనుకున్నారు. లేడీ ఫాలోయింగ్ పెంచిన పాత్ర అది. ఇప్పుడు ఈ సినిమాతో అబ్బాయిలంతా ఇలాంటి తండ్రి ఉండాలనుకునేలా అభిమానులు పెరుగుతారు`` అన్నారు.