ఎమ్మెల్యే టికెట్ నేనే వద్దన్నా... ఈసారి మాత్రం శుభవార్త పక్కా..: నటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Feb 15, 2022, 5:36 PM IST

అమరావతి: ఏపీ సీఎం కార్యాలయం నుండి పిలుపు రావడంతోనే కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి వచ్చినట్లు సినీనటుడు అలీ తెలిపారు. అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుందని... అయితే ఏమిస్తారో తనకు చెప్పలేదన్నారు.నేనెప్పుడు పదవులు ఆశించకుండా పార్టీ కోసం పని చేశానని అలీ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని జగన్ అన్నారని... అయితే టైం తక్కువ ఉండడంతో తానే వద్దని తిరస్కరించినట్లు అలీ తెలిపారు. ఎమ్మెల్యే అంటే గ్రౌండ్ నుండి వర్క్ చెయ్యాలి... ఫేస్ వ్యాల్యూ బట్టి అవ్వదని అన్నారు. అయితే ఈరోజు మాత్రం సీఎంతో భేటీ పూర్తిగా వ్యక్తిగతమని నటుడు అలీ తెలిపారు.