May 20, 2023, 4:25 PM IST
యూట్యూబర్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు హర్షసాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు.. ఆ వ్యక్తి ఎంత ఫేమస్సో అందరికి తెలుసు. ఎంత మంది పోటీకి వచ్చినా..యూట్యూబర్స్ లో స్టార్ అంటే హార్ష సాయి పేరే వినిపిస్తుంది. అటువంటి యంగ్ టాలెంటెడ్ కుర్రాడు త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.