Dec 21, 2020, 12:39 PM IST
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ముగిసింది. చిరంజీవి, నాగార్జున వంటి సినీరంగ అతిరథ మహారథుల సమక్షంలో విన్నర్ గా నిలిచిన అభిజీత్ సగర్వంగా ట్రోఫీని ఎత్తుకున్నాడు. టైటిల్ కోసం అఖిల్, అభిజీత్ పోటీపడగా... అత్యధిక ఓట్లు పొందిన అభిజీత్ ని విన్నర్ గా నాగార్జున ప్రకటించారు. కాగా టాప్ 3కి వెళ్లిన సోహైల్ ఫైనల్ కి వెళ్లకుండానే డబ్బులు తీసుకొని రేసు నుండి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత సీజన్లలో కూడా ఇలా డబ్బును చూపించి ఆశ పెట్టినప్పటికీ... కంటెస్టెంట్లెవరు డబ్బు తీసుకొని వెళ్ళలేదు. కానీ సోహైల్ మాత్రం అనూహ్యంగా తొలుత 10 లక్షలను కాదని, ఆ తరువాత 25 లక్షలను తీసుకొని వెళ్లడంపై ఇప్పుడు కొత్త రచ్చ మొదలయింది.