Dec 9, 2019, 9:54 PM IST
కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట వెంకటరమణ అనే యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గేదెల డైరీ కోసం 5 మంది సభ్యులకు మంజూరు అయిన 28,75,000 లక్షల చెక్కును అకౌంట్ లో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అక్కడే వున్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిది ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయితీగా తెలుస్తోంది.