Dec 30, 2020, 3:43 PM IST
రెండో టెస్టులో అద్వితీయ విజయాన్ని అందుకున్న టీమిండియాకి మరో శుభవార్త. చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ, బుధవారం జట్టుతో కలవనున్నాడు. సిడ్నీలో క్వారంటైన్ పీరియడ్ గడిపిన రోహిత్ శర్మ, డిసెంబర్ 30 నుంచి భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొంటాడు. రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో టి నటరాజన్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.