చెన్నై పై ఢిల్లీ అద్భుత విజయం, ధోని పునరాలోచించాల్సిన సమయం

Sep 26, 2020, 1:08 AM IST

బ్యాటింగ్ లో పృథ్వీ షా(64 పరుగులు 43 బంతుల్లో), ధవన్ 35, పంత్ 37 పరుగులతో రాణించడమే కాకుండా... బౌలర్లు రబడ 2, నోర్జే 2 వికెట్లతో అదరగొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ పై డిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచిన డిల్లీ 20 ఓవర్లలో కేవలం 131 పరుగులకే 7 వికెట్లతో కట్టడి చేసి 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బ్యాట్స్ మెన్స్ లో డుప్లెసిస్ 43 పరుగులు చేసి హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.