Galam Venkata Rao | Published: Feb 20, 2025, 7:00 PM IST
జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చూపుతోందని, దురుద్దేశంతోనే ప్రభుత్వం ఆ పని చేస్తోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా, జగన్‌కు ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత తొలగించిన విషయాన్ని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. ఇది పునరావృతం కాకుండా విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల్లో ప్రభుత్వం ఆయనకు ఏ మాత్రం కల్పించడం లేదంటూ.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావుతో పాటు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎం.అరుణ్‌కుమార్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.