Galam Venkata Rao | Published: Feb 6, 2025, 7:02 PM IST
రానున్న ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలన దారుణంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తనకు మైక్ ఇస్తే ప్రజలకు నిజాలు చెబుతానన్న భయంతో వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు.