అధికార బలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రావాలని.. చంద్రబాబును ఎప్పుడెప్పుడు దింపేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని మండిపడ్డారు.