Jul 15, 2020, 2:23 PM IST
పరవాడ ఫార్మా సిటీలో ఇటీవల ప్రమాదం జరిగిన విశాఖ సాల్వెంట్ ఘటనా స్థలాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ప్రమాదంపై యాజమాన్యంతో పాటు సిబ్బందిని విజయసాయి రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు.