Jul 26, 2022, 12:39 PM IST
విశాఖపట్నం : కార్గిల్ విజయ దివాస్‌ను పురస్కరిం చుకొని కార్గిల్ అమరవీరులకు నేవీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు నివాళులర్పించారు. నేవీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. 1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం జరిగింది. అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.