నరసరావుపేటలో విషాదం... ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను చంపి... తల్లి ఆత్మహత్య

నరసరావుపేటలో విషాదం... ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను చంపి... తల్లి ఆత్మహత్య

Published : Feb 07, 2023, 09:45 AM IST

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలో లేక మరేదైనా కారణమో తెలీదుగానీ ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. 

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలో లేక మరేదైనా కారణమో తెలీదుగానీ ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తల్లీ బిడ్డల ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

నరసరావుపేట పెద్దచెరువు 13వ లైన్ లో శివలింగేశ్వరి-ఇంద్రారెడ్డి దంపతులు ఇద్దరు బిడ్డలు చరణ్ సాయిరెడ్డి(8), జితిన్ రెడ్డి(4)తో కలిసి నివాసముండేవారు. అయితే గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు జరిగేవి. ఇవి తాజాగా తారాస్థాయికి చేరడంతో శివలింగేశ్వరి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో భర్త లేని సమయంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.