Jul 4, 2022, 1:38 PM IST
విజయవాడ : కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా 75వ జయంతి వేడుకలు బెజవాడలో ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో ఏర్పాటుచేసిన తండ్రి మోహనరంగా విగ్రహాన్ని వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు, వంగవీటి అభిమానులు భారీగా పాల్గొన్నారు. తండ్రి జయంతి కార్యక్రమంలో రాధ మాట్లాడుతూ... వంగవీటి రంగా కాపు నాయకుడు మాత్రమే కాదు పేదల పెన్నిది కూడా అని అన్నారు. రంగా ఒక వ్యక్తి కాదు శక్తి... ఆయన ఒక్క విజయవాడకు, ఒక్క సామాజికవర్గానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదన్నారు. రంగా కొడుకుగా పుట్టడం నా అదృష్టం... ఆయన ఆశయాలను కొనసాగిస్తానని వంగవీటి రాధ పేర్కొన్నారు.