Jan 2, 2023, 1:25 PM IST
కోనసీమ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేసారు. స్వామివారి గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని పూలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ముఖ్యంగా పూలతోనే శేషపాన్పుపై నిద్రిస్తున్న మహావిష్ణువు రూపాన్ని ఆవిష్కరించిన తీరు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారులు తీరాయి.