Dec 16, 2019, 10:41 AM IST
గుంటూరు జిల్లా తాడికొండలో పెద్ద మసీదు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కారుని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అవ్వడంతో అది తెల్లవారుజామున సుమారు 3 - 3.30 గంటల మధ్య జరిగివుండొచ్చని స్థానికులు అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుంటూరు ఎమ్మెల్యే md ముస్తఫా ఇంటి సమీపంలో ఇది జరగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.