తూ.గో జిల్లాలో ఘోరం... రైలు వస్తుండగా పట్టాలపైకి దూకి వ్యక్తి ఆత్మహత్య

Mar 23, 2022, 2:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బొమ్మూరు నుండి వేమగిరి వైపు జాతీయ రహదారిపై వెళుతూ ఓ వ్యక్తి అమాంతం రైల్వే ట్రాక్ పై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే అండర్ బ్రిడ్జిపైనుండి సరిగ్గా ట్రెయిన్ వస్తున్న సమయంలో అతడు దూకడంతో శరీరం ఛిద్రమై రైల్వే పట్టాలపై పడిపోయింది. ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి వుంది.