పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్, సీఎం జగన్

Mar 5, 2022, 10:48 AM IST

పోలవరం: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించారు. ఇవాళ(శుక్రవారం) ఉదయమే ఏపీకి చేరుకున్న కేంద్ర మంత్రి సీఎం జగన్ తో కలిసి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. హిల్ వ్యూ ప్రాంతం నుండి నిర్మాణంలో వున్న ప్రాజెక్ట్ ను పరిశీలించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్ట్ పురోగతిని కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర మంత్రి,సీఎం జగన్ వీక్షించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని షెకావత్ ముఖ్యమంత్రి జగన్ కు హామీ ఇచ్చారు.