Mar 27, 2023, 5:20 PM IST
విశాఖపట్నం : విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి భారీగా డబ్బులు వసూలుచేసి కుచ్చుటోపి పెట్టింది విశాఖపట్నం ఆటోనగర్ కు చెందిన గ్రాండ్ వెల్డ్ ఇన్స్టిట్యూట్. సౌదీ అరేబియాలో ఉద్యోగాల పేరిట అరవైవేలు వసూలు చేసి 72 మందిని పంపించింది వెల్డింగ్ సంస్థ. అయితే కేవలం ఆరునెలలు మాత్రేమే వీసా ఇచ్చి తిరిగి రెన్యూవల్ చేయకపోవడంతో సౌదీ అధికారులు 72 మంది బాధితులకు తిరిగి ఇండియాకు పంపించారు. దీంతో మోసపోయిన బాధితులు గ్రాండ్ వెల్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా దిక్కున్నవారికి చెప్పుకోమంటూ దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని సదరు సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.