vuukle one pixel image

రాజధాని ద్రోహి డౌన్ డౌన్ నినాదాలతో... వైసిపి ఎమ్మెల్యే ఆర్కే కు ఉండవల్లిలో నిరసన సెగ

Feb 8, 2023, 5:34 PM IST

మంగళగిరి : వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామస్తులు షాకిచ్చారు. బుధవారం ఉదయం ఉండవల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే పర్యటించగా కొందరు గ్రామస్తులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారు. ''ఓట్లు వేయించుకొని మా ఊరిని దోపిడీ చేసిన ఆర్కే డౌన్ డౌన్'' ''రాజధాని ద్రోహి ఆర్కే డౌన్ డౌన్'' అంటూ తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నవారిని ఎమ్మెల్యే సముదాయించే ప్రయత్నం చేసారు. అయితే నిరసనకారులు వినకపోవడంతో ఎమ్మెల్యే ఆర్కే అక్కడినుండి వెళ్ళిపోయారు.