మంగళగిరి టిడిపి నేత హత్యకేసు...మృతుడు ఉమా యాదవ్ కుటుంబపై దాడి

Aug 29, 2023, 5:12 PM IST

మంగళగిరి : గతంలో దారుణ హత్యకు గురయిన టిడిపి నేత ఉమా యాదవ్ కుటుంబంసభ్యులపై ఇవాళ కొందరు దుండుగులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, స్థానిక పోలీసులు సహకారంతోనే ఉమా యాదవ్ ను చంపినవారే తమపై దాడి చేయించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమను బెదిరించి    హత్యకేసులో సెటిల్ మెంట్ కు రావాలని బెదిరిస్తున్నారని ఉమా యాదవ్ కుటుంబసభ్యులు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ మంగళగిరి మెయిన్ రోడ్డుపై గాయాలతోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా హత్య కేసు త్వరితగతిన చేయాలని... బయట ఉండి తమపై దాడులకు దిగుతున్న ముద్దాయిల బైయిల్ రద్దు చేయాలని ఉమా యాదవ్ డిమాండ్ చేశారు.