Jul 7, 2020, 11:11 AM IST
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో అన్నదమ్ముల కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. తలారి పెద్దయ్య, తలారి రాఘవేంద్రల కుమారులు తలారి విజయ్, తలారి శివ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు పొలం పనులలో నిమగ్నమై ఉండగా పొలం దగ్గర ఉన్న నీటికుంట దగ్గరకు వెళ్లారు. కుంటలో కాలుజారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కాసేపటికి పిల్లలేరని గమనించిన తల్లిదండ్రులు అనుమానంతో నీటి కుంటలు వెతికారు. కానీ అప్పటికే నీటి గుంటలో పడి ఊపిరి ఆడక చనిపోయిన తమ కుమారులను చూసి కన్నీరుమున్నీరయ్యారు. పది నిమిషాల క్రితం కళ్ళ ముందు ఆడుకుంటున్న పిల్లలు శవాలుగా మారడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.