ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సంద‌ర్భంగా తిరుపతిలో గోల్డ్ ఏటీఎంలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటీఎంలో నేరుగా మనీ తీసుకున్నట్టు వీటిలో బంగారాన్ని కోనుగోలు చేయవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బు తీసుకున్నట్లే.. ఈ గోల్డ్ ఏటీఎంలో కూడా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులను ఉప‌యోగించి బంగారు డాలర్లను విత్ డ్రా చేయవచ్చు. తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్లు ఈ ఏటీఎంల నుంచి కోనుగోలు చేయవచ్చు.