Dec 24, 2019, 3:31 PM IST
తుళ్ళూరులో మహిళా రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరు రోజులుగా పిల్లలతో సహా రోడ్డుమీద నిరసన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్టించుకోవడంలేదని, ఆమె తప్పిపోయిందంటూ ఫిర్యాదు చేశారు. ఒకవేళ పోలీసులకు దొరికితే తమ దగ్గరికి తీసుకురావాలని, రానంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సిందిగా తమ తరఫున చెప్పాలని పోలీసులకు తెలిపారు.