Jul 1, 2020, 4:46 PM IST
కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు కు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వినతి పత్రం అందించారు. 24 సంవత్సరాల క్రితం కర్నూల్లో తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించామని, గత పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు అప్పటి ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని టీజీ వెంకటేష్ అన్నారు. అలాగే తుంగభద్ర నదిలో మురుగునీరు కలవకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు నది పరివాహక ప్రాంతంలో ఘాట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.