Jan 22, 2021, 12:23 PM IST
జి.ఓ నెంబర్ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సి.ఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ తో పాటు కొంత మందిని మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్డడి పిలుపు నేపథ్యంలో తాడేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం జగన్ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం నివాసానికి వెళ్లే దారులను అన్నింటినీ మూసేశారు. సీఎం నివాసం వైపు వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేశారు.