Jan 13, 2022, 2:52 PM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగు సినీపరిశ్రమకు మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో స్టార్ హీరో చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఇవాళ(గురువారం) హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి అక్కడినుండి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాను వచ్చినట్టుగా చిరంజీవి చెప్పారు.
తన నివాసానికి చేరుకున్న చిరంజీవికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సీఎం జగన్ ను సత్కరించారు. అనంతరం తెలుగు సినీ పరిశ్రమ ప్రభుత్వ నిర్ణయాలవల్ల ఎలా నష్టపోతోందో వివరించేందుకు సీఎంతో చిరంజీవి భేటీ కానున్నారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి చిరంజీవి లంచ్ చేయనున్నారు.