Aug 18, 2022, 5:02 PM IST
అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల కోసం జగన్ సర్కార్ డిజిటల్ అటెండెన్స్ ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయులు సమయానికి స్కూల్ కి వచ్చి మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదుచేయాల్సి వుంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు కిందే పరిగణిస్తారు. అయతే ఈ యాప్ సరిగ్గా పనిచేయడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఒకేసారి ఉపాధ్యాయులంతా యాప్ ఉపయోగించాల్సి రావడంతో సర్వర్లు పనిచేయకపోవడంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాకే డిజిటల్ అటెండెన్స్ అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.