తమిళ సినిమాలో వచ్చిన మాస్టర్ పీస్ లవ్ స్టోరీల్లో 'విన్నైతాండి వరువాయా'ది ముఖ్య స్థానం. 2010లో వచ్చిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకుడు. సింబు, త్రిష జంటగా నటించారు. కార్తీక్, జెస్సీ పాత్రల్లో వాళ్ళు బాగా నటించారు.
25
VTV సినిమా
సింబు కెరీర్‌లో 'విన్నైతాండి వరువాయా' ఒక మైలురాయి. తమిళంలో ఎక్కువసార్లు రీ-రిలీజ్ అయిన సినిమా కూడా ఇదే. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే నాడు ఈ సినిమాని రీ-రిలీజ్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. 15 ఏళ్లయినా ఇప్పటికీ ఆకర్షణ తగ్గలేదు.
35
సింబు, VTV గణేష్
'విన్నైతాండి వరువాయా' చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సమంతకి ఇదే మొదటి సినిమా. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న VTV గణేష్‌కి నటుడిగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో ఆయనా ఒకరు.ఈ చిత్రాన్ని తెలుగులో నాగ చైతన్య, సమంత తో తెరకెక్కించారు. ఏమాయ చేశావే టైటిల్ తో ఈ చిత్రం విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.
45
VTVకి మొదటి ఎంపిక మహేష్ బాబు
ఇంత ఫేమస్ అయిన 'విన్నైతాండి వరువాయా' సినిమాలో హీరోగా నటించడానికి గౌతమ్ మీనన్ మొదట మహేష్ బాబునే అనుకున్నారట. కానీ ఆ సమయంలో మహేష్ బాబు మాస్ సినిమాలు చేస్తుండడంతో లవ్ స్టోరీ వద్దనుకున్నారట.
55
వివేక్ VTVని వద్దన్నారు
తర్వాత సింబుకి ఈ అవకాశం వచ్చింది. మహేష్ బాబు నటించకపోవడం మంచిదే అంటున్నారు అభిమానులు. సింబు నటన అద్భుతంగా ఉంది. VTV గణేష్ పాత్రలో మొదట వివేక్ నటించాల్సి ఉండగా, డేట్స్ సరిపోకపోవడంతో VTV గణేష్‌ని తీసుకున్నారు.