రష్మిక మందన్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ఛత్రపతిలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈసినిమాలో మహారాణి యేసుబాయిగా రష్మిక కనిపించబోతోంది. ఇక మహారాణి పాత్రలో రాజరికపు లుక్ లో రష్మికా మాందన్న అందరిని ఆకట్టుకుంది.
ఛత్రపతి చిత్రం నుండి రష్మిక మందన్న తన మొదటి లుక్ పోస్టర్‌లను ఆవిష్కరించారు, ఇందులో ఆమె మహారాణి యేసుబాయిగా నటిస్తున్నారు. చీర, ఆభరణాలతో ఆమె మహారాణి గెటప్ లో ఆమె మెరిసిపోతోంది. మహారాణి యేసుబాయిని "స్వరాజ్యపు గర్వం" అని ఆమె పోస్ట్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ జనవరి 22న రిలీజ్ కాబోతోంది.
Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..?