Mar 23, 2022, 10:08 AM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రమాదకరమైన కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని... స్వయంగా ప్రభుత్వ పెద్దలే కమీషన్ల కోసం ఈ అక్రమ మద్యం దందాను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. ఈ మేరకు కల్తీ మద్యం అమ్మకాలు, మరణాలపై చర్చించాలంటూ బడ్జెట్ సమావేశాల ప్రారంభంనుండి టిడిపి శాసనసభాపక్షం నిరసన చేపడుతోంది. ఇలా (ఇవాళ) కూడా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న కల్తీ మద్యం మరణాల పాపం జగన్ రెడ్డిదే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.