గద్దె దంపతుల 12గంటల నిరాహారదీక్ష : లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన వారికోసమే..

Apr 13, 2020, 10:54 AM IST

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 5 వేల రూపాయలు ఇవ్వాలంటూ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా పథకాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.  గద్దె రామ్మోషన్ తో పాటు, గద్దె అనూరాధ చేపట్టిన ఈ దీక్షకు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబు మద్దతు తెలిపారు.