టీడీపీ నేతల హౌస్ అరెస్టు (వీడియో)

31, Oct 2020, 12:02 PM

దళిత, బిసి రైతులకు సంకెళ్లు‌ వేయడాన్ని నిరసిస్తూ ఛలో  గుంటూరు జైలు భరోకి అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జేఎసి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు ఉదయమే మొగల్రాజపురంలో ఆయన నివాసంలో జెఎసి అధ్యక్షుడు  శివారెడ్డికి నోటీసు ఇచ్చి, హౌస్ అరెస్టు చేశారు.తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. నక్కా ఆనందబాబు తదితరులను హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.