Jan 13, 2022, 1:40 PM IST
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వెల్ధుర్తి మండలం గుండ్లపాడులో టిడిపి నేత తోట చంద్రయ్య ప్రత్యర్థుల చేతిలో గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. మాచర్ల టడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకడిగానే కాదు గుండ్లపాడు గ్రామ శాఖ అధ్యక్షుడిగా, చంద్రయ్య కొనసాగుతున్నాడు. ఇవాళ గ్రామ సెంటర్లో చంద్రయ్య కూర్చున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. చంద్రయ్యను హత్య చేసిన తర్వాత దుండగులు పారిపోయారు. ఈ దారుణం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.