రాష్ట్ర ప్రభుత్వమే మడ అడవుల్ని నరికించడం దుర్మార్గం.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

May 12, 2020, 2:21 PM IST

జీవవైవిధ్యంలో కీలకమైన మడ అడవుల నరికివేత దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాకినాడ సముద్ర తీరంలోని మడ అడవులను ప్రభుత్వమే వైసీపీ కాంట్రాక్టర్లతో నరికేయించడం సహించరాని విషయం అని, మడ చెట్లు సముద్ర తీరంలో వేలాది జీవులకు ఆవాసం అని,  మత్స్సకారులకు జీవనోపాధిని కల్పించడంతో పాటు తుఫాన్లు, బలమైన గాలులు వీచిన సమయంలో మడ అడవులు రక్షణగా నిలుస్తున్నాయి. సముద్రపు నీటిలో ఉప్పు శాతాన్ని తగ్గించి బ్యాక్ వాటర్ కారణంగా పొలాలు నాశనం  కాకుండా కాపాడుతున్నాయి. మడ అడవుల నరికివేత పర్యావరణానికి తీరని ముప్పుగా మారుతుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ తీరని నేరంగా పరిగణిస్తున్నారు. ఎవరైనా తెలిసీతెలియక మడ చెట్లను నరికితే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కోట్లాది రూపాయలిచ్చి ఆ అడవులే లేకుండా చేయడం క్షమించరాని నేరం అన్నారు.