రాజధాని, పోలవరంపై క్లారిటీ... రైతులు, విద్యార్థులకు గుడ్ న్యూస్ ... వైసిపి మేనిఫెస్టోలో కీలకాంశాలివే..

First Published Apr 27, 2024, 5:08 PM IST

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళీ ముఖ్యమంత్రి అయితే, వైసిపి తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలియజేసే మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో రైతులు, విద్యార్థులతో పాటు పలు వర్గాలకు మరింత లబ్ది చేకూరుస్తామని వైసిపి ప్రకటించింది. 

YS Jagan

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి మేనిఫెస్టో విడుదల చేసింది.  మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తారు... ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలను అందిస్తారో ఈ మేనిఫెస్టోలో వివరించారు. మూడు రాజధానులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ పై కూడా మేనిఫెస్టో లో క్లారిటీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం ఏం చేసిందో వివరించిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా మేనిఫెస్టో ద్వారా రాబోయే ఐదేళ్లు ఏం చేయనున్నారో ప్రకటించారు. 
 

మేనిఫేస్టో లోని కీలక అంశాలు :

1. మూడు రాజధానులు : 

ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానుల ఏర్పాటుకు వైసిపి కట్టుబడి వుందని... ఇప్పటికే ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. అమరావతి నుండి కాకుండా విశాఖపట్నం నుండి పాలన సాగించేందుకు వైసిపి ప్రయత్నించింది... కానీ సాధ్యం కాలేదు. అయితే ఈసారి అధికారంలోకి రాగానే అమరావతి కేవలం శాసన రాజధానిగానే కొనసాగుతుందని... విశాఖపట్నం పాలన, కర్నూల్ న్యాయ రాజధానిగా కొనసాగుతుందని జగన్ ప్రకటించారు.  

Polavaram

2. పోలవరం : 

గత టిడిపి, ప్రస్తుత వైసిపి పాలనలోనూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాలేదు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది... దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంశాన్ని కూడా వైసిపి మేనిఫెస్టో చేర్చారు. వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. 
 

YSRCP

3.  జగనన్న అమ్మఒడి : 

ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు వైసిపి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇలా ఒక్కో విద్యార్థికి ప్రతి ఏడాది రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో వేస్తోంది ప్రభుత్వం. కానీ మళ్లీ అధికారంలోకి వస్తే మరో రెండువేలు పెంచి ఏడాదికి రూ.17వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 

YSRCP

4.రైతు భరోసా :

రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇప్పటికే పెట్టుబడి సాయంకింద ప్రభుత్వమే ఏటా రూ.13,500 అందిస్తోంది ప్రభుత్వం. అయితే మళ్లీ వైసిపిని గెలిపిస్తే ఈ సాయం రూ.16 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 

YSRCP

5. పథకాలకు నిధులు పెంపు :

వివిధ పథకాల ద్వారా మహిళలు, పలు సామాజిక వర్గాలు, నిరుపేదకు ఆర్థిక సాయం చేస్తోంది జగన్ సర్కార్. ఇలా ఇప్పటికే  వైఎస్సార్ చేయూత కింద అర్హులకు  రూ.75 వేలు అందిస్తుండగా మళ్లీ అధికారంలోకి వస్తే లక్షా 50 వేలకు పెంచనున్నట్లు ప్రకటించారు.  వైఎస్సార్ కాపు నేస్తం రూ.60 వేల నుండి లక్షా 20 వేలకు, వైఎస్సార్ ఈబిసి నేస్తం రూ.45వేల నుండి లక్షా 5 వేల రూపాయలకు పెంచనున్నట్లు ప్రకటించారు. 

YSRCP

6. వైఎస్సార్ వాహనమిత్ర :

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లుకు ప్రతి ఏడాది ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకాన్ని లారీ డ్రైవర్లకు కూడా అందజేయనున్నట్లు వైసిపి మేనిఫెస్టోలో పేర్కొంది. మళ్లీ అధికారంలోకి రాగానే ఆటో,  ట్యాక్సీ డ్రైవర్లతో పాటే లారీ డ్రైవర్లకు కూడా రూ.10వేల సాయం ప్రతిఏటా అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే ప్రమాదవశాత్తు వీరు మరణిస్తే రూ.10 లక్షల భీమా వచ్చేట్లు ఏర్పాట్లు  చేసామన్నారు. 
 

7. దళితులకు ప్రత్యేక పంచాయితీలు : 

దళితులకు ప్రత్యేక పంచాయితీలను ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. దళిత జనాభా 500 వందల కంటే ఎక్కువ వుంటేచాలు దాన్ని ప్రత్యేక పంచాతీగా ఏర్పాటుచేస్తామని వైసిపి మేనిఫఎస్టోలో పేర్కొన్నారు. 

Bhogapuram

8. భోగాపురం పోర్టు : 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.రూ.4,592 కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ ఎయిర్ పోర్ట్ ను రాబోయే ఐదేళ్లతో పూర్తిచేస్తామని మేనిఫేస్టోలో పేర్కొన్నారు. 

YSRCP

9. జీవన భీమా : 

వైఎస్సార్ జీవన భీమా పథకాన్ని స్విగ్గి, జొమాటో, అమెజాన్ సంస్థల్లో పనిచేసే డెలివరీ భాయ్స్ కి వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల వరకు భీమా అందించనున్నారు.  
 

YSRCP

10. మతపరమైన పథకాలు : 

హిందూ దేవాలయాల నిర్వహణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు వైసిపి మేనిఫేస్టోలో పేర్కొన్నారు.  అలాగే ముస్లిం, క్రిస్టియన్ మతాలవారి ప్రార్థనా స్థలాల నిర్వహణకు కూడా ప్రత్యేక నిధిని కేటాయించనున్నట్లు తెలిపారు. 

YS Jagan

11.ఇప్పటికే కొనసాగుతున్న పథకాలన్నీ కొనసాగింపు : 

వైసిపి ప్రభుత్వం గత ఐదేళ్ళలో అమలుచేసిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ రాబోయే ప్రభుత్వంలో కూడా కొనసాగుతాయని వైసిపి మేనిఫేస్టో చెబుతోంది. అన్ని వర్గాల సంక్షేమం,  అన్ని ప్రాంతాల అభివృద్దికి వైసిపి కృషిచేస్తోందని వైసిపి అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 

click me!