Jan 24, 2020, 4:27 PM IST
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటూ తాడికొండ అడ్డరోడ్డులో జే.ఏ.సి ఆధ్వర్యంలో 21వ రోజు మహాధర్నా కొనసాగుతుంది. ఈ దీక్షకు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతిలో 33,000 ఎకరాలు సమీకరించినా ఏ ఒక్క రోజు పోలీసుల హడావిడి లేదు కానీ 3 రాజధానులు ప్రతిపాదనతో రాజధాని గ్రామాల్లో పోలీసుల దారుణాలు మొదలయ్యాయి. సమీకరణ సమయంలో అధికార పార్టీ ఎం.ఎల్.ఏ అయినప్పటికీ శ్రవణ్ కుమార్ రైతులు, రైతు కూలీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. స్థానిక ఎం.ఎల్.ఏ శ్రీదేవి రైతులకు సంఘీభావం తెలియచెయ్యకపోవడం దారుణం అన్నారు.