May 2, 2022, 2:54 PM IST
విశాఖపట్నం: టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తయారయితే ప్రస్తుతం వైసిపి హయాంలో రుణాంధ్ర ప్రదేశ్ గా మారిందని... ఈ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ అన్నారు. ఇప్పుడు మరో ముందడుగు వేసి ఆంధ్రాని అంధకారప్రదేశ్ గా మార్చేశారని ఎద్దేవా చేసారు. ఏపీలో దారుణ పరిస్థితులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయన్నారు. ఏపీపై కేటీఆర్ వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమేనన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, రోజా, అమర్నాధ్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారని ఎండీ నజీర్ అభిప్రాయపడ్డారు.