Nov 24, 2021, 2:36 PM IST
విజయవాడ: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి కౌన్సిలర్లతో కలిసి బస్సులో వెళ్లేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బస్సు ఎక్కనివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదానికి దిగారు. పోలీసులపై దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో గొల్లపూడి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.