Aug 7, 2020, 10:39 AM IST
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. బెయిల్‌పై కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఆయన ఇంటికి కూడా చేరకముందే విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. వారిపై దూసుకెళ్లారు. ఘాటు పదాలతో దౌర్జన్యానికి దిగారు. తన అనుచరులతో 20 వాహనాల్లో కడపనుండి అనంతపురం ర్యాలీగా బయల్దేరారు. అయితే కరోనా కారణంగా అదీ రాత్రిపూట కర్ఫ్యూ ఉందని అనంతపురం శివార్లలో పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లమీద విరుచుకుపడ్డాడు. మళ్లీ అరెస్టు చేస్తావా? ఏం పీకుతావ్? పక్కకు పో అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో మళ్లీ వివాదాలు కొని తెచ్చుకున్నట్టు