Jul 28, 2020, 10:48 AM IST
కరోనాకు భయపడకుండా ప్రతీ సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కుటుంబసభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. కొత్త జీవిత విధానానికి శ్రీకారం చుట్టాలన్నారు. డిజిటల్ సోషలైజేషన్, వర్చువల్ వర్కింగ్ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పని చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని అన్నారు. ప్రజలు మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉండాలి.