నడిరోడ్డుపై...పట్టపగలే... యువతిపై ప్రేమోన్మాది దాడి (వీడియో)

Oct 16, 2019, 4:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని గతకొన్నిరోజులుగా వేదిస్తున్న ప్రేమోన్మాది ఇవాళ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వినుకొండ ఎస్వికెపి కళాశాలకు చెందిన తేజస్విని విద్యార్థిని ఈరోజు ఉదయం కళాశాలకు వెళ్లేందుకు కవిటం బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుండగా సుధాకర్ అనే వ్యక్తి  కత్తితో దాడిచేశాడు. దీంతో ఆమె తల చిట్లిపోయి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు ఆమెను పాలకొల్లు ప్రభుత్యాసుపత్రి తరలించారు.  తేజస్విని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం ఏలూరు లేక విజయవాడకు తరలించాలని వైద్యులు సూచించారు.